గోదావరి మళ్లి ఉగ్రరూపం దాల్చుతోంది. రాజమహేంద్రవరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 11.8 అడుగులకు నీటిమట్టం చేరింది. ధవళేశ్వరం ఆనకట్టకు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలోకి 10లక్షల 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మేడిగడ్డతో పాటు ప్రాణహిత,ఇంద్రావతి,శబరి ఉపనదులు నుంచి భారీగా గోదావరిలోకి వరద నీరు చేరుతోంది. వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి