పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలేరుపాడు మండలంలోని సంతబజార్, రుద్రంకోట, రేపకగొమ్ము, తట్కూరు గొమ్ము, నార్లవారం కాలనీలను వరద నీరు చుట్టుముట్టింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కరోనాతో సతమతమవుతున్న ప్రజలను.. వరదలు మరింత అతలాకుతలం చేస్తున్నాయి. వేలేరుపాడులోని 23 గ్రామాలు నీటమునిగాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడం లేదని ముంపు గ్రామాలవాసులు ఆవేదన చెందుతున్నారు. వీలైనంత తొందరగా నిర్వాసితుల ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జూన్ నాటికి ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయిలో ప్యాకేజీ అందజేసి తరలిస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారని..కానీ ప్రస్తుతం వరద నీటితో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న వారు కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : ఊహించని ఉపద్రవం.... బాధితుల్ని ఆదుకోండి: చంద్రబాబు