గోదావరి ప్రవాహం మరింతగా తగ్గింది. రాజమహేంద్రవరం వద్ద నది ప్రవాహం 5 లక్షల క్యూసెక్కుల కంటే తక్కువకు చేరింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గేట్లు ఎత్తి మిగులు జలాలు సముద్రంలోకి వదులుతున్నారు. మంగళవారం నాటికి వరద ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఘాట్లలో పేరుకుపోయిన చెత్త
రాజమహేంద్రవరం వద్ద గోదావరి ప్రవాహంతో ఘాట్లలో చెత్త పేరుకుపోయింది. వరద ప్రవాహంతో బురద, మట్టి వచ్చి చేరింది. ఘాట్లను శుభ్రం చేసే పనిలో నగరపాలక సిబ్బంది నిమగ్నమయ్యారు.
ఇది కూడా చదవండి.