తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో 460 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు విశాఖ జిల్లా పాడేరు అటవీ ప్రాంతం నుంచి గంజాయి ప్యాకెట్లను తరలిస్తుండగా.... పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు వ్యక్తులు, రెండు వాహనాలతోపాటు 10 చరవాణులు, 38 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తమిళనాడుకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు పంపుతున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 46 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
రావులపాలెంలో 460 కేజీల గంజాయి పట్టివేత - police
పోలీసుల తనిఖీల్లో 460 కేజీల గంజాయి పట్టుబడింది. ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 వాహనాలు, 10 చరవాణులు, రూ.38 వేలు స్వాధీనం చేసుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో 460 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు విశాఖ జిల్లా పాడేరు అటవీ ప్రాంతం నుంచి గంజాయి ప్యాకెట్లను తరలిస్తుండగా.... పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు వ్యక్తులు, రెండు వాహనాలతోపాటు 10 చరవాణులు, 38 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తమిళనాడుకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు పంపుతున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 46 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
అగ్ర కులాల్లోని నిరుపేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అగ్ర కులాల ప్రజలకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర నాయకుడు గుణవర్మ ఆధ్వర్యంలో కడప జిల్లా రాజంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజంపేట రైల్వే స్టేషన్ రోడ్లోని ఆర్వోబి నుంచి పాత బస్టాండ్ వరకు వివిధ పాఠశాలల విద్యార్థులతో చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోకాలంగా అగ్రకులాల నిరుపేదలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ ఉండేదని చెప్పారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో పది శాతం రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం జరిగిందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్ ను అమలు చేస్తుండగా ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా నా రాష్ట్రంలో పది శాతం రిజర్వేషన్ను అమలుచేసి అగ్రకులాల్లోని నిరుపేదలకు న్యాయం చేయాలని కోరారు.
Body:అగ్రకుల పేదలకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
Conclusion:బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు