తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి శివారులో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. భారీగా గంజాయిని గుర్తించారు. పట్టుబడిన సరుకు విలువ రూ. 10.72 లక్షలుగా పోలీసులు తేల్చారు. గంజాయితో పాటు... టాటా ఏస్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మారేడుమిల్లి నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న వాహనాలను జీఎం వలస కూడలి వద్ద తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే గంజాయి తరలింపును అడ్డుకున్నామన్నారు.
ఇదీ చదవండి:
పోలీసులపై వైకాపా నేత అనుచిత వ్యాఖ్యలు... గట్టి కౌంటర్ ఇచ్చిన మహిళా సీఐ