తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం, ఆత్రేయపురం మండల్లాలో నాటుసారా విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను రావులపాలెం పోలీసులు అరెస్టు చేశారు. నాటుసారా విక్రయిస్తూ పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రావులపాలెం సీఐ. కృష్ణ హెచ్చరించారు. ఆత్రేయపురం మండలం పులిదిండిలో 30 లీటర్ల సారా, ముగ్గురు వ్యక్తులను.. రావులపాలెం మండలం గోపాలపురంలో 20 లీటర్ల నాటుసారా, ఒక వ్యక్తిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్కు తరలించామని చెప్పారు.
ఇదీచదవండి.