తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో పోలీసులకు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సత్కారం చేశారు. పోలీసు సిబ్బందికి బియ్యం, నిత్యావసర సరకులు అందజేశారు. నెహ్రూ మాట్లాడుతూ.. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో వారు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. వారు చేసిన కృషి కారణంగానే నియోజకవర్గంలో ఒక్క కొవిడ్ కేసు నమోదుకాలేదన్నారు. వారిని సత్కరించుకోవడం మన బాధ్యతని అన్నారు.
అత్యవసర పనులకు తప్ప ఎవరూ బయటకు రావొద్దని కోరారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి.. సీఎంఆర్ఎఫ్కు తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ విరాళం.. రూ. కోటి