కరోనా ప్రభావంతో తిండి దొరక్క మూగజీవాలు అలమటిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నుంచి గోకవరం వెళ్లే రహదారికి ఇరువైపులా చెట్లపై ఏళ్ల తరబడి వందల సంఖ్యలో కోతులు నివాసం ఉంటున్నాయి. స్థానికంగా ఉండే ప్రముఖ దేవస్థానం సింగరమ్మతల్లి ఆలయం వద్ద భక్తులు వేసే ఆహారం, ఆ దారిలో వెళ్లే ప్రయాణికులు వేసే పళ్లు, చిరుతిళ్లే వాటికి ఆధారం. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆ రహదారి వెంట ప్రయాణాలు ఆగిపోయాయి.
ఆలయం వద్ద కూడా ఏమీ దొరక్క వానరాలు ఆకలితో విలవిల్లాడుతున్నాయి. ఈ క్రమంలో జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబ సభ్యులు వాటికి అండగా నిలిచారు. బియ్యం, అరటిపండ్లు, పల్లీ లడ్డూలను కోతులకు, ఆవులకు ఆహారంగా వేసి వాటి ఆకలి తీర్చారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ సతీమణి, పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: