తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పుట్టినరోజు వేడుకలను, కృష్ణవరం గ్రామంలో తెదేపా నాయకులు ఘనంగా నిర్వహించారు. బాణాసంచా కాల్చి కేక్ కట్ చేశారు. అనంతరం గ్రామస్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. కృష్ణవరం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచిన ఏకైక నాయకుడు జ్యోతుల నెహ్రూ అని కొనియాడారు. గ్రామంలో ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు వేసి, పుష్కర ఎత్తిపోతల పథకం నీళ్లను ఏలేరుకు అనుసంధానం చేసి... ఈ ప్రాంతంలో పంటలు సుభిక్షంగా పండించుకోవడానికి నీళ్లను అందించిన అపర భగీరథడు అని అన్నారు.
ఇదీ చదవండి:
గొడవ ఆపేందుకు వెళ్లి వ్యక్తి మృతి... పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత