ముఖ్యమంత్రికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే టిక్కెట్లు అమ్మాలని నటీనటులు, సినిమా పెద్దలు అంటున్నారని.. కానీ ఒక ఎగ్జిబిటర్‌గా తన సూచనను కూడా గౌరవించాలని లేఖలో కోరారు. సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చును నిర్మాత నుంచి ప్రభుత్వమే వసూలు చేసి.. ఆన్లైన్ ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలా చేస్తే నల్లధనం సమస్యే రాదన్నారు. ఫలితంగా చిత్ర నిర్మాణ ఖర్చు కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: