ETV Bharat / state

ఆ గ్రామంలో వన సమారాధన... కులమతాలకు అతీతం

కార్తీకమాసం ప్రారంభమైందంటే... జోరుగా వన సమారాధనలు జరుగుతుంటాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కులాల వారీగా విడిపోయి వన సమారాధన జరుపుకుంటారు. కాని తూర్పుగోదావరి జిల్లా రవీంద్రపురం ప్రజలు కులమతాలకు అతీతంగా ఊరంతా ఒక్కటై జరుపుకుంటారు.

author img

By

Published : Nov 24, 2019, 11:55 PM IST

ఆ గ్రామ వనసమారాధన... కులమతాలకు అతీతం
ఆ గ్రామంలో వన సమారాధన... కులమతాలకు అతీతం

తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం రవీంద్రపురంలోని ప్రజలు... కార్తీక వన సమారాధనను కులాల వారీగా కాకుండా... ఊరంతా ఒక్కటై జరుపుకుంటారు. 700 కుటుంబాలు, 1500 జనాభా ఉన్న ఈ గ్రామంలో సుమారు 15 వరకు కులాలు ఉన్నాయి. కానీ ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఈ గ్రామస్థులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. గత 20 ఏళ్లుగా గ్రామస్థులందరూ వారికి తోచినంత నగదు వేసుకొని పొలాలకు వెళ్లి శివుడిని పూజిస్తారు. వన సమారాధన వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా ఇదే తరహాలో వన సమారాధన నిర్వహించుకున్నారు. చిన్నారుల నృత్యాలు, యువకుల ఆటపాటలు, పెద్దల కబుర్లు, ముచ్చట్లతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ఆనందంగా గడిపారు.

Intro:ఒకే గ్రామం .....ఒకే వనసమారాధన

కులాలకు అతీతంగా వన సమారాధన

కార్తీక మాసం ప్రారంభం అయ్యింది అంటే జోరుగా వన సమారాధనలు జరుగుతుంటాయి. గ్రామ మండల జిల్లా స్థాయిలో కులాల వారీగా విడిపోయి వన సమారాధన జరుపుకుంటారు. ఈ వన సమారాధనలు దాదాపు అన్ని ప్రాంతాల్లో కులాల వారీగా జరగడం చూసాం.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం రవీంద్ర పురం లోని ప్రజలు కార్తీక వన సమారాధన కులాల వారీగా కాకుండా కులాలకు అతీతంగా ఊరంతా ఒక్కటై ఒక్కసారే జరుపుకుంటారు. ఏడు వందల కుటుంబాలు 1500 జనాభా ఉన్న గ్రామంలో సుమారు 15 వరకు కులాలు ఉన్నాయి. కానీ ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఈ గ్రామస్తులు అంతా ఒకటై వన సమారాధన జరుపుకుంటూ కులాల మధ్య తేడా లేదని నిరూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత 20 ఏళ్లుగా కార్తీకమాసంలో గ్రామస్తులందరూ తల నగదు వేసుకొని స్థానిక పొలాలకు వెళ్లి శివుడిని పూజిస్తే వనసమారాధన వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా ఇదే తరహాలో గ్రామస్తులు అందరూ ఏకమై ఘనంగా వనసమారాధన నిర్వహించుకున్నారు. చిన్నారుల నృత్యాలు యువకుల ఆట పాటలు పెద్దవారు కబుర్లు ముచ్చట్లతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో సాఫీగా ఆనందంగా గడిపారు.

Body:గంప రాజు. పిఠాపురం

Conclusion:7995067047

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.