తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో శుక్రవారం తెల్లవారుజామున కొండలు పొగమంచుతో అలముకున్నాయి. మండు వేసవిలోనూ పర్వతాలు మంచు కమ్ముకోవడంతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పగటిపూట ఎండ, రాత్రి పూట చలి ఉండటం వల్ల మంచుతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మారేడుమిల్లి వెళ్లే ప్రధాన రహదారిలో పొగమంచుతో కొండలన్నీ కమ్ముకొని ఉండటంతో వాతావరణం ఆహ్లాదంగా మారింది.
ఇవీ చూడండి : అబ్బాయి మెడలో తాళి.. విచిత్రంగా ఉంది కదూ!