సాధారణంగా అరటిచెట్టు పూర్తిగా ఎదిగాక పువ్వు పూస్తుంది. అడుగు ఎత్తున్న అరటిమొక్కకు పువ్వు రావడం ఆశ్చర్యమే... ఈ వింత తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని బడుగువానిలంకకు చెందిన రైతు తమ్మన శ్రీనివాసు తోటలో కనిపించింది. అరటి పిలక నాటిన నెల రోజులకే పువ్వు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
జన్యుపరమైన లోపాల కారణంగా ఇలా జరుగుతుందని ఉద్యానవన శాఖ ఎండీ ఆర్ దేవానంద కమార్ అంటున్నారు. ఆ పువ్వు గెలలా ఎదిగే అవకాశం లేదని తెలిపారు.
ఇదీ చదవండి