ETV Bharat / state

Floods to Andhra Pradesh Projects: భారీ వర్షాలు.. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. వాళ్లు అప్రమత్తంగా ఉండాలి..!

Heavy Floods to Projects: రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో పలు జలాశయాలకు వరద పోటెత్తుతోంది. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Floods to Andhra Pradesh Projects
Floods to Andhra Pradesh Projects
author img

By

Published : Jul 27, 2023, 10:49 AM IST

Heavy Water Flow to Dhavaleswaram: రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు వరద పోటెత్తుతోంది. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, దానికి తోడు ఎగువ నుంచి వస్తున్న వరదలతో గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటి మట్టం 12.5 అడుగులకు చేరింది. డెల్టా పంట కాల్వలకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 10 లక్షల 97 వేల క్యూసెక్కుల వరదను వదులుతున్నారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Flood Water to Prakasam: ప్రకాశం బ్యారేజ్‌కు వరద పెరుగుతోంది. మున్నేరు, బుడమేరు, పాలేరు నుంచి కృష్ణా నదికి వరద వస్తోంది. ప్రకాశం బ్యారేజికి 78వేల 840 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 40 గేట్లు 2 అడుగుల మేర, మరో 30 గేట్లు అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న నీటిని యథాతథంగా సముద్రంలోకి వదిలేస్తున్నారు.

Water Flow to Thungabhadra: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తింది. ఉత్తర, దక్షిణ కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తోంది. తుంగభద్ర జలాశయం పూర్తి నీటిమట్టం 16వందల 33 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 16వందల 15.5 అడుగులు ఉంది. ప్రస్తుతం 1లక్షా 13వేల 981 క్యూసెక్కుల నీరు తుంగభద్ర జలాశయానికి వస్తోంది.

Water Flow to Polavaram: పోలవరం ప్రాజెక్టులో భారీగా సీపేజీ, లీకేజీ నీరు కాఫర్ డ్యాంల మధ్య చేరింది. పోలవరం స్పిల్ వే నుంచి దాదాపు 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్తుండటం, ఎగువ నుంచి ప్రవాహాలు పెరగటంతో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య సీపెజీ నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 19.72 మీటర్ల ఎత్తున నీరు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

Munneru: ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కంచికచర్ల మండలాల పరిధిలో మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు ఉద్ధృతి మీదున్నాయి. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద మూడు ఏర్లకు సంబంధించిన వరద పోటెత్తుతోంది. కీసర వద్ద కలిసే మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు జోరుతో 67 వేల క్యూసెక్కుల ప్రవాహం... చందర్లపాడు మండలం ఏటూరు వద్ద కృష్ణా నదిలోకి చేరుతోంది. ఏర్ల ఉద్ధృతితో ఆయా ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లకుండా పోలీసులను కాపలా పెట్టారు. ఇక వైరా ఏరు, కట్టలేరు వరద ప్రవాహంతో నందిగామ - వీరులపాడు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం వద్ద దుకాణ సముదాయాల్లోకి వరద నీరు చేరింది. లింగాల వంతెన నీట మునిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.