తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి శనివారం రాత్రి ఉగ్రరూపం దాల్చింది. దీంతో దేవీపట్నంతో పాటు వీరవరం, తొయ్యరు, పూడిపల్లి, దండంగి, పోచమ్మ గండి పూర్తిగా ముంపునకు గురయ్యాయి. బాధితులను ఇందుకూరుపేటలో ముసిని గుంట, రంపచోడవరంలో గురుకుల పాఠశాల, గురుకుల కళాశాల, ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాలలకు తరలించారు. ముంపు గ్రామాలను ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంత ఉదయభాస్కర్ సందర్శించకపోవడం పలు విమర్శలకు దారి తీసింది. ముంపు బాధితులు వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు కల్పించాల్సిన పునరావాసాన్ని, ప్యాకేజీని పూర్తిస్థాయిలో కల్పించాలని పోలవరం ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి. వరద ప్రవాహం.. గ్రామస్థుల సహాయం.. ప్రభుత్వ సిబ్బందికి తప్పిన ప్రమాదం