తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని రోజులుగా వరద ప్రవాహంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామస్తులు తిండి లేక అలమటిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వమే పూర్తిగా ఆదుకుంటుందని లంక గన్నవరం నియోజకవర్గంలో పర్యటించిన శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. ఈ సందర్భంగా అక్కడి గ్రామస్తులకు బియ్యం పంపిణీ చేశారు. పంట నష్టాల నమోదు ప్రక్రియను తప్పులు లేకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఇవీ చదవండి