తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు జాతీయ రహదారిపై సగ్గుబియ్యం బస్తాల లోడుతో వెళ్తున్న వ్యాను అగ్నిప్రమాదానికి గురైంది. పెద్దాపురం నుంచి రాజమహేంద్రవరం మార్కెట్కు వెళ్తున్న వ్యాన్ దివాన్ చెరువు వద్ద జాతీయ రహదారి పక్కన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. వ్యాను ముందుభాగం అగ్నికి ఆహుతి అయింది.
ఇదీ గమనించిన స్థానికులు వ్యానులో ఉన్న 35 సగ్గు బియ్యం బస్తాలను కిందకు లాగేశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపు చేశారు. సుమారు రెండు లక్షల వరకు నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: రానున్న రెండేళ్లలో దళితుల అభివృద్ధికి రూ.40వేల కోట్లను ఖర్చు చేస్తాం: మంత్రి పినిపే విశ్వరూప్