ETV Bharat / state

గుర్రపుడెక్కతో పంట కాలువలకు చేరని నీరు

ముమ్మిడివరం నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తుంటారు. ఆ మెత్తానికి పంట కాలువల ద్వారా వచ్చే నీరే దిక్కు. నాలుగు మండలాల్లో 45 కిలోమీటర్ల మేర బ్రాంచ్ కాలువలు ఉన్నాయి. అందులో మొత్తం గుర్రపు డెక్క పేరుకుపోవటంతో రైతులకు నీరందక అవస్థలు పడుతున్నారు.

వరిసాగుకు గుర్రపుడెక్క అడ్డు-తొలగించండి
author img

By

Published : Jul 1, 2019, 1:00 PM IST

వరిసాగుకు గుర్రపుడెక్క అడ్డు-తొలగించండి

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు. దీనికి పంట కాలువ ద్వారానే నీరు అందవలసి ఉంది. ఈ నాలుగు మండలాలలో 45 కిలోమీటర్ల మేర బ్రాంచ్ కాలువలు ఉన్నాయి. ప్రతి ఏటా 'నీరు-చెట్టు' కార్యక్రమం ద్వారా వేసవిలో ఉపాధి కూలీల ద్వారా పంట కాలువలో పూడికతీత తీసి.. చెత్తను తొలగించి ఖరీఫ్ సీజన్ నాటికి నీరందేలా చేసేవారు. ఈ ఏడాది ఎన్నికల వల్ల ఈ పనులు చేపట్టకపోవడంతో పంట కాలువలన్నీ గుర్రపుడెక్క, ఇతర వ్యర్ధాలతోనిండిపోయాయి. కాలువలకు నీరు వదిలి నెల గడుస్తున్నా రైతు చేనుకు నీరు అందడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలోని పూడికను.. గుర్రపు డెక్కను తొలగించాలని రైతులు కోరుతున్నారు. ఈ నెలలో అధిక వర్షాలతో గోదావరి నది పాయలకు వరదలు సంభవించే అవకాశం ఉన్నందునా.. అధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

Intro:ap_tpt_51_01_dsp_press_meet_avb_ap10105

హత్యకేసు నిందితుల అరెస్టు

Body:రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఊసరపెంట వద్ద జరిగిన పరువు హత్య నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు పలమనేరు డిఎస్పీ యుగంధర్ బాబు చెప్పారు. పలమనేరు మండలం ఉసరపెంట గ్రామంలో కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో కక్ష కట్టిన కన్న తల్లిదండ్రులే హేమవతి అనే మహిళ ను గత నెల జూన్ 28వ తేదీ పట్టపగలే అత్యంత కిరాతకంగా హత్యచేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హత్య అనంతరం నిందితులు పరారు కాగా సోమవారం నల్గాంపల్లె వద్ద నిందితుల ఆచూకీ కనుగొన్న పోలీసులు హత్యలో పాల్గొన్న ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. మృతురాలు హేమవతి తల్లిదండ్రులు, ఆమె సోదరులు, సోదరితో పాటు తాత ను అరెస్టు చేశారు. వీరిపై కిడ్నప్, హత్య, ఎస్సిఎస్టీ సెక్షన్ల కింద కేస్ నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని డిఎస్పీ యుగంధర్ బాబు వెల్లడించారు.

Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.