ETV Bharat / state

పేదలకు పట్టాలు ఇవ్వాలని రైతు కూలీ సంఘం నిరసన - Farmer Coolie Association protest news

తూర్పుగోదావరి జిల్లాలో పేదలు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుకూలీ సంఘం సభ్యులు, నాయకులు ధర్నాకు దిగారు. పేదలకు ఈ భూమి వచ్చే విధంగా పట్టాలు మంజూరు చేయాలంటూ అధికారులకు సంఘం సభ్యులు వినతి పత్రం అందజేశారు.

Farmer Coolie Association protest
పేదలకు పట్టాలు ఇవ్వాలని రైతు కూలీ సంఘం నిరసన
author img

By

Published : Jun 1, 2020, 4:30 PM IST

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామాల్లో సర్వే నెంబర్ 474లో సుమారు 15 ఎకరాల 61 సెంట్ల భూమిని 12 సంవత్సరాలకు పైబడి నిరుపేదలు సాగు చేసుకొంటున్నారని, ఆ భూమి ఎప్పటినుంచో వారి ఆధీనంలోనే ఉందని రైతుకూలీ సంఘం నాయకులు తెలిపారు. సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు ఇప్పించాలని పలుమార్లు జగ్గంపేట తహసీల్దార్, జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగారని అన్నారు. అయితే రెవెన్యూ అధికారులు ఈ విషయంపై స్పందించడం లేదని రైతు కూలీ సంఘం ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు బత్తుల అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఈ భూమి వచ్చే విధంగా పట్టాలు మంజూరు చేయాలంటూ అధికారులకు సంఘం సభ్యులు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి... ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు దోచేశారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.