జగ్గంపేట మండలం భావవరం గ్రామంలో సురక్షిత మంచినీటి పథకంలో పదేళ్లుగా ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్న వారిని... తొలగించడం అన్యాయమని జగ్గంపేట మాజీఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. బావవరంలో ఒప్పంద కార్మికులు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు ప్రకటించారు. మూడు రోజుల నిరాహార దీక్ష చేస్తున్న కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వన్ని కోరారు. రాజకీయ కక్షతో ఐదుగురిని ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమన్నారు. తిరిగి ఉద్యోగాలు ఇచ్చే వరకూ తెదేపా వారికి అండగా ఉంటుందని హామీఇచ్చారు.
ఇవీ చూడండి...సత్యదేవుని వ్రతం ఆచరించిన తాబేలు