కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2021ను వ్యతిరేకిస్తూ తూర్పు గోదావరి జిల్లా మోతుగూడెంలో లోయర్ సీలేరు విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చీఫ్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన చేపట్టారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే విద్యుత్ రంగం మొత్తం ప్రైవేటీకరణ అవుతుందని ఐకాస ప్రతినిధులు ఆరోపించారు. సమస్త మనుగడ కోల్పోయి ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సూపరిండెంట్ ఆఫ్ ఇంజనీర్ కే.వెంకటేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐకాస ఛైర్మన్ కిరణ్, కన్వీనర్ రామకృష్ణ రత్నాకర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: