అడవి జంతువులను వేటాడి.. సొమ్ము చేసుకునేందుకు.. అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కలిదిండి సురేష్ పశువులు కాస్తూ.. వ్యవసాయం చేసుకునేవాడు. ఈ క్రమంలో అడవిలోకి వెళ్లి తిరిగి వస్తుండగా.. విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అటవీ అధికారులకు, విద్యుత్ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. దుంప తోటల మధ్య కరెంటు ట్రాప్స్ పెడుతుండటంతో.. పెంపుడు జంతువులు సైతం అవి తగిలి విద్యుత్ షాక్కు గురై మృత్యువాతపడుతున్నాయని వాపోతున్నారు.
తప్పిపోయిన తన గేదెను వెతుక్కుంటూ అటవీ ప్రాంతంలోకి వెళ్లిన అశోక్.. అక్కడ అక్రమార్కులు అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్కు గురై దుర్మరణం చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగిందని, ఈ ఘటనలో అశోక్ కుమార్ మృతికి కారకులైన మొత్తం 11మందిన అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు.. జగ్గంపేట సీఐ సురేష్ బాబు తెలిపారు. జంతువులను వధించడం కోసం అర్ధరాత్రులు చట్టవిరుద్ధంగా జి వైర్లు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే ఎవరినైనా ఉపేక్షించే లేదని కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ హెచ్చరించారు.
సంబంధిత కథనం: