తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 'ఈనాడు పెళ్లిపందిరి' డాట్ నెట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుల వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. గోదావరి ఘాట్ రోడ్డులోని ఆహ్వానం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వధూవరులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. వధూవరుల వివరాలను తెరపై ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో వారి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా 'ఈనాడు' వివాహ పరిచయ కార్యక్రమం నిర్వహించిందని వధూవరుల తల్లిదండ్రులు తెలిపారు.
ఇదీ చూడండి: