ETV Bharat / state

'ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు' - తూర్పుగోదావరిలో ధాన్యం కొనుగోలు

గోదాముల కొరత లేదు.. గోనె సంచులు అందుబాటులో ఉన్నాయి.. రవాణా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తోంది.. అయినా.. ధాన్యం కొనుగోళ్లు ఎందుకు మందకొడిగా సాగుతున్నాయని.. తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌ (రైతు భరోసా, రెవెన్యూ) జి.లక్ష్మీశ అధికారులను ప్రశ్నించారు.

east godavari paddy purchase
తూర్పుగోదావరి సంయుక్త కలెక్టర్ లక్ష్మీశ
author img

By

Published : May 17, 2020, 3:17 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులు, రైస్‌ మిల్లర్లతో సంయుక్త కలెక్టర్ లక్ష్మీశ సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు 3.52 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారని, రైతులు పండించిన ధాన్యాన్ని నూరుశాతం కొనుగోలు చేయడానికి తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. డివిజన్‌ స్థాయిలో పీపీసీ నిర్వాహకులు, రైస్‌ మిల్లర్లు, అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మిల్లర్లు సీఎంఆర్‌ ఎప్పటికప్పుడు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు లక్ష్మీరెడ్డి, డీఎస్‌వో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

రబీ దిగుబడిలో లక్ష్యసాధన

జిల్లాలో రబీ ధాన్యం దిగుబడిలో లక్ష్యాన్ని సాధించినట్లు జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు కె.యస్‌.వి.ప్రసాద్‌ తెలిపారు. జిల్లాలో 13.78లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశామని, ఆ మేరకు లక్ష్యం చేరుకున్నామన్నారు. 1,65,138 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు రబీ సాగు చేశారని, అందులో 99.50 శాతం విస్తీర్ణంలో రబీ మాసూళ్లు పూర్తయినట్లు వెల్లడించారు. మిగిలిన 00.50శాతం 2, 3 రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు.

ఇవీ చదవండి.. 'భవిష్యత్ అంతా ఆ వాహనాలదే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.