ETV Bharat / state

MPP election: దీటైన వ్యూహం.. తమదైన విజయం.. - ఏపీ ఎన్నికలు తాజా వార్తలు

క్షణక్షణం ఉత్కంఠ.. స్వల్ప వాగ్వాదాలు.. అక్కడక్కడా అలకలు.. బుజ్జగింపుల నడుమ మండల పరిషత్తు పాలనా పగ్గాల ఎన్నిక ప్రక్రియ శుక్రవారం సాగింది. తూర్పుగోదావరి జిల్లాలో మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్‌ ఎన్నిక ప్రక్రియ ఒక మండలం మినహా అంతటా పూర్తయింది. పి.గన్నవరం మండలంలో కోరం లేక శనివారానికి ఎన్నిక వాయిదా పడగా.. మిగిలిన 59 మండలాల్లో ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో హెచ్చు స్థానాల్లో అధికార పక్షం ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకోగా.. కొన్నిస్థానాల్లో ఉత్కంఠ రేపి... రాజకీయ ఆసక్తిని పెంచి ఇతర పక్షాలూ పీఠం దక్కించుకున్నాయి.

east godavari mpp elections
east godavari mpp elections
author img

By

Published : Sep 25, 2021, 9:31 AM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఎంపీపీ ఎన్నిక వేళ ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ముందు నుంచే అవగాహనతో పోటీకి వెళ్లిన తెదేపా- జనసేన మధ్య తొలి రెండున్నరేళ్లు పీఠం మాదంటే.. మాదనే మాట పట్టింపులు.. వ్యవహారం ఎటూ తేలక సమావేశానికి ఇరు పార్టీలూ గైర్హాజరయ్యాయి. దీంతో కోరం లేక ఎన్నికల అధికారి ప్రక్రియను వాయిదా వేశారు. వైకాపా, బీఎస్పీ అభ్యర్థులు హాజరైనా ఫలితం లేకపోయింది. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ జోక్యంతో ఇరు పార్టీల శ్రేణుల్లో సయోధ్య కుదిరినట్లు సమాచారం. మొదటి రెండేళ్లు తెదేపా, తర్వాత వ΄డేళ్లు జనసేన అభ్యర్థి ఎంపీపీ పీఠం ఎక్కేలా ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెదేపా ఎంపీపీగా ముంగండ ఎంపీటీసీ సభ్యురాలు అంబటి భూలక్ష్మి పేరు వినిపిస్తోంది.

మిత్ర లాభం...

రాజోలు: అయిదుగురు జనసేన, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో తెదేపా అభ్యర్థి కేతా శ్రీనివాసరావు ఎంపీపీ అయ్యారు. మిత్రలాభం కలిసొచ్చి వైస్‌ ఎంపీపీగా జనసేన అభ్యర్థి ఆనందరాజు, కో-ఆప్టెడ్‌గా తెదేపా నుంచి షేక్‌ ఇస్మాయిల్‌ ఎన్నికయ్యారు. చింతపల్లి-1 అభ్యర్థి (వైకాపా) గైర్హాజరవడం చర్చనీయాంశమైంది.

ఫిరాయింపుతో...

వైకాపా అభ్యర్థికి మద్దతు తెలుపుతున్న తెదేపా సభ్యురాలు

జనసేన- తెదేపా పొత్తు ఫలించకపోవడం.. ఎన్నిక వేళ తెదేపా పెనికేరు ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి వైకాపాకు ఓటేసి.. తర్వాత ఆ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. దీనిని ముందే పసిగట్టి ఈ ఎన్నికల సమావేశాన్ని తెదేపా అభ్యర్థులు బహిష్కరించారు. దీంతో చొప్పెళ్ల-2 ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మణ రావుకు పీఠం వరించింది.

కూటమిదే.. పీఠం

కడియంలో జనసేన - తెదేపా అభ్యర్థికి మద్దతు తెలుపుతున్న సభ్యులు

కడియం: ఉత్కంఠ నడుమ జనసేన- తెదేపా కూటమి ఎంపీపీ పీఠం దక్కించుకుంది. ఉదయం నుంచి భారీగా పోలీసులు మోహరించి అప్రమత్తం అయ్యారు. తెదేపా- జనసేన ఒప్పందం ప్రకారం ఎంపీపీగా కడియం-2 తెదేపా ఎంపీటీసీ సభ్యుడు వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్‌ ఎన్నికయ్యారు. ఈ కూటమికి 12 ఓట్లు దక్కితే.. వైకాపా ఎంపీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజుకు తొమ్మిది మంది మద్దతే దక్కింది.
బి-ఫారం పొందిన అభ్యర్థుల పార్టీ సంఖ్యా బలం ఆధారంగా ఎన్నిక నిర్వహించాలని వైౖకాపా జేగురుపాడు-1 ఎంపీటీసీ ఆకుల సుధాకర్‌ డిమాండ్‌ చేసినా.. ఎన్నికల అధికారి పరిగణనలోకి
తీసుకోలేదు.

ఉపాధ్యక్ష ఎన్నికలో రగడ..

వాగ్వాదానికి దిగిన నల్లచెరువు నాయకులు

అయినవిల్లి: స్వతంత్ర అభ్యర్థి బలం వైకాపాకు తోడవడంతో పీఠం సునాయాసంగా నాగ విజయలక్ష్మికి దక్కింది. నల్లచెరువు- ఎన్‌పెదపాలెం సభ్యుడు వెంకట రామారావుకు ఉపాధ్యక్ష పదవి ఇస్తామని.. చివరికి అయినవిల్లి సభ్యుడు చిన్నబాబుకు ఇవ్వడంతో వైకాపాలో రగడ చోటుచేసుకుంది. పార్టీకి, ఎంపీటీసీకి రాజీనామా చేస్తానని.. తనను అవమానించారని ఆయన వాపోయారు.

లాటరీతో వరించిన పదవి..

వీఆర్‌పురం: లాటరీ పద్ధతిలో విజేతను ఎంపిక చేస్తున్న అధికారి

వీఆర్‌పురం: మండలంలో వైకాపా, తెదేపా- సీపీఎం కూటమి బలం సమానం కావడంతో ఇక్కడా లాటరీ అనివార్యమైంది. దీంతో ఎంపీపీ పీఠం సీపీఎం అభ్యర్థి కారం లక్ష్మికి, ఉపాధ్యక్ష పదవి వైకాపా అభ్యర్థి ముత్యాల భవానీకి దక్కింది.

మలికిపురం: ఇక్కడ బలాలు సమానంగా ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. జనసేన అభ్యర్థి రామరాజులంక ఎంపీటీసీ అభ్యర్థి మేడిచర్ల వెంకట సత్యవాణి ఎంపీపీ అయ్యారు. వైస్‌ ఎంపీపీ పీఠం తెదేపా అభ్యర్థి గుబ్బలపాలెం ఎంపీటీసీ కందికట్ల నిర్మలకు లాటరీతోనే వరించింది.

కూనవరం: ఎంపీపీ పీఠం లాటరీ ద్వారా వైకాపా దక్కించుకుంటే.. ఉపాధ్యక్ష పీఠం లాటరీ ద్వారా జనసేనకు.. కో- ఆప్షన్‌ పదవి తెదేపాకు దక్కింది. చిన్నార్కూర్‌ ఎంపీటీసీ పాయం రంగమ్మను ఎంపీపీగా ప్రతిపాదించడంతో.. ఎంపీపీ పదవి ఆశించి భంగపడిన వెంకటాయపాలెం ఎంపీటీసీ సభ్యురాలు మడకం నాగరాణికి మద్దతుగా ఆమె భర్త నిరసన తెలుపుతూ ఆమెను బయటకు తీసుకెళ్లడంతో.. వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఆవుల మరియాదాస్‌ ఎస్సై గుణశేఖర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నిక వేళ ఇతరులను లోపలకు ఎలా పంపుతారని ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. బయటకు వెళ్లిన అభ్యర్థిని మళ్లీ లోనికి పంపడంలో వైకాపా శ్రేణులు సఫలీకృతం కావడంతో పీఠం పదిలమైంది.

మొత్తం స్థానాలు: 60

ఎన్నిక జరిగింది: 59

వాయిదా: 1

వైకాపా: 55

తెదేపా: 2

జనసేన: 1

సీపీఐ(ఎం): 1

ఇదీ చదవండి:

PARISHAD: జిల్లా పరిషత్‌ చైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక నేడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.