ఇంటర్మీడియట్ ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన షేక్ రజియాను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అభినందించి రూ. 1500 నగదు బహుమతి అందించారు. ఆత్రేయపురం మండలం మెర్లపాలెంకు చెందిన షేక్ రజియా మండపేటలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం పూర్తిచేసింది. అందులో 470 మార్కులకు 465 సాధించి జిల్లాలో ప్రథమ స్థానం, రాష్ట్రస్థాయిలో రెండో స్థానం సాధించి కొత్తపేట నియోజకవర్గానికి వన్నె తెచ్చిందని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అభినందించారు.
ఇదీ చూడండి