ETV Bharat / state

Illegal detention case: అక్రమ నిర్బంధం కేసు.. ఎస్ఐ సస్పెండ్​.. - Kottapeta SI suspended

అక్రమ నిర్బంధం కేసులో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎస్ఐ ఎల్.శ్రీనునాయక్ సస్పెన్షన్​కు గురయ్యారు. ఈ మేరకు ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు.

అక్రమ నిర్బంధం కేసు
Illegal detention case
author img

By

Published : Sep 24, 2021, 10:01 AM IST

Updated : Sep 24, 2021, 12:50 PM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎస్.ఐ శ్రీను నాయక్​ను సస్పెండ్​ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ కె వి మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్ అనే యువకుడు హత్యకేసులో అక్రమంగా తనని అనుమానితురాలిగా భావించి నిర్బంధించారని గుంటూరుకు చెందిన అక్తర్ రోషన్​ అనే గర్భిణి ఆరోపించారు. కొన్ని రోజులపాటు తనతో పాటు బంధువులను అక్రమంగా కొత్తపేట పోలీస్​స్టేషన్​లో నిర్బంధించారని మహిళ హైకోర్టులో కార్పస్ పిటీషన్ వేసింది.

ఈ కేసుపై విచారణ చేపట్టాల్సిందిగా అదనపు డీజీ రవిశంకర్ అయ్యర్​, ఏలూరు డీఐజీ కెవీ మోహనరావును హైకోర్టు ఆదేశించింది. అక్రమ నిర్బంధం వాస్తవమేనని తేలడంతో.. ఎస్ఐ శ్రీనునాయక్​ను సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో మరో అధికారిపై కూడా చర్యలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండీ.. CLAP program: అక్రమ వసూళ్లకు ‘క్లాప్‌’ కొట్టారు!

Last Updated : Sep 24, 2021, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.