అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని తూర్పుగోదావరి జిల్లా అగ్రిగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంఘం కోరింది. కాకినాడలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట వినియోగదారులు, ఏజెంట్లు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
గత ప్రభుత్వ హాయాంలో అగ్రి బాధితులకు న్యాయం చేస్తామని వైకాపా ప్రకటించిందని... ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ సమస్యకు పరిష్కారాన్ని చూపాలన్నారు. బాధితులకు డిపాజిట్ చేసిన మొత్తాన్ని అందించేలా బడ్జెట్లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ...ప్రయాణికుల ఆదరాభిమానాలను చూరగొంటున్న గన్నవరం విమానాశ్రయం