ఆ తండ్రి వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన మాదిరిగా కుమారులు కష్టపడకూడదని...మంచిగా చదువుకుని స్థిరపడాలని భావించాడు. అందుకోసం రాత్రింబవళ్లు కష్టపడి వారిని చదివించాడు. కుమారులు బాగా చదివి..పేరు తీసుకువస్తారని కల కన్నాడు. ఇంతలోనే ఆ రోజు వచ్చింది. దీంతో తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన విష్ణు వివేక్.. ఈఏపీసెట్ అగ్రి-ఫార్మా విభాగంలో మొదటి ర్యాంక్ సాధించి తల్లిదండ్రుల కలను నిజం చేశాడు.
రాజమహేంద్రవరం తిరుమల విద్యాసంస్థల్లో 7వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివిన విష్ణు వివేక్.. తెలంగాణ ఎంసెట్‌లోనూ 5వ ర్యాంకు సాధించాడు. విష్ణు అన్నయ్య సైతం నీట్లో మెరుగైన ర్యాంకు సాధించి.. భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. తమ కళాశాల విద్యార్థి మొదటి ర్యాంకు సాధించడం సంతోషకరమని.. తిరుమల విద్యా సంస్థల ఛైర్మన్ తిరుమల రావు తెలిపారు.
ఇదీ చదవండి: