పుదుచ్చేరి ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడేందుకు గత 4 సంవత్సరాలుగా ఎన్నో సంస్కరణలు చేపట్టిందని ఆ రాష్ట్ర పర్యటకశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. సౌరశక్తి, బయో డీజిల్‌తో నడిచే వాహనాలు ఉపయోగించే వారికి రాయితీలు ఇస్తున్నామని తెలిపారు. యానాంలో ఈ -బైక్ షోరూమ్‌ను ప్రారంభించారు. మొదటి బైక్ కొన్న విద్యార్థినికి ఆయన తాళం అందజేశారు. భవిష్యత్ అంతా పర్యావరణ సంరక్షిత వాహనాలదేనని.. ఆ దిశగా వ్యాపారులు మారాలని సూచించారు.
ఇవీ చదవండి.. ప్రభుత్వం అనుమతిస్తే.. దర్శనాలకు సత్యదేవుని ఆలయం సిద్ధం!