లాక్డౌన్తో ఒంటరి మనుషుల జీవనం దుర్భరంగా మారింది. ఉపాధి దూరమై, సాయం చేసే వారు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి వారికి సాయం అందిస్తోంది ఓ సాధారణ రైతు కుటుంబం. రోజూ వందల మంది ఆకలి తీరుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవుకి చెందిన నందికోళ్ల శ్రీమన్నారాయణ, శ్రీదేవి దంపతులు నిత్యం వంద మందికిపైగా పేదల ఆకలి తీరుస్తున్నారు. సాధ్య ఫౌండేషన్ పేరుతో... లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నా అన్నవారు ఎవరూ లేనివారికి రోజూ వేడివేడిగా వండి వడ్డిస్తున్నారు. వీరి దాతృత్వాన్ని చూసిన మరికొందరు దాతలు వారికి సహకరిస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా ఒంటరిగా జీవించే వారికి ఆహారం అందిస్తామని ఆ రైతు కుటుంబం చెబుతుంది. ఒంటరిగా ఉన్న తమను ఆదుకొని.. కష్ట కాలంలో కాస్త ముద్ద పెడుతున్న రైతు కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు పేదలు.
ఇదీ చదవండి: వెయ్యి కుటుంబాలకు 6 టన్నుల కూరగాయలు పంపిణీ