ETV Bharat / state

కరుణ చూపని కరోనా... ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి - రావులపాలెంలో కరోనా కేసులు

కరోనా.. ఆనందంగా సాగిపోతున్న జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కరోనాతో, ఒకరు క్యాన్సర్ తో మృతిచెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో తీరని శోకాన్ని మిగిల్చింది.

కరుణ చూపని కరోనా... ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

author img

By

Published : Aug 13, 2020, 11:03 PM IST

కరోనా.. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఆనందంగా సాగే జీవితాలలో తీరని విషాదాన్ని నింపుతోంది. రెండు వారాల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందిన ఘటన అందరినీ కలిచివేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన ఒక కుటుంబంలో ఐదుగురు కరోనాతో మృతిచెందగా, ఒకరు క్యాన్సర్ తో మరణించారు. తొమ్మిది మంది మగవారు, ఒక ఆడ సంతానం ఉన్న కుటుంబం రావులపాలెంలో నివసిస్తోంది. ఇందులో మొదటి సంతానమైన మహిళ (77) కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతూ జులై 26వ తేదీన మృతి చెందారు.

ఈ విషాదం మరవక ముందే ఆమె మొదటి, మూడవ తమ్ముళ్ల కుటుంబాలకు చెందిన ఐదుగురుకి కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మొదటి తమ్ముడు(75) ఆగస్ట్ 6న, ఆయన కుమారుడు(52) జులై 8న మృతి చెందగా, మూడో తమ్ముడు భార్య (63) ఆగస్టు 5న, కొడుకు (42) జులై 30న, మనవడు(17) ఆగస్ట్ 6న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ మరణించారు. రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందడం కలిచివేసింది.

ఇదీ చదవండి:

అచ్చెన్న త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.