తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉన్న సారాబట్టీలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. రాజవరంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో తయారు చేసేందుకు నిల్వ ఉంచిన 1800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వద్దిపర్రులోనూ 20 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఎవరైనా సారా తయారు చేస్తున్నట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ ఎ. వి.చలం అన్నారు.
ఇదీ చదవండి: