ETV Bharat / state

తూర్పు మన్యంలో 1000 కిలోల గంజాయి పట్టివేత

నూలు దారాల లోడులో చాటుగా తరలిస్తున్న 1000 కిలోల గంజాయిని తూర్పు గోదావరి జిల్లా మోతుగూడెం సరిహద్దు గ్రామం సుకుమామిడి వద్ద పోలీసులు పట్టుకున్నారు. సరుకు విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Drugs Seized
1000 కిలోల గంజాయి పట్టివేత
author img

By

Published : Jul 19, 2021, 10:28 AM IST

తూర్పు గోదావరి జిల్లా మోతుగూడెం సరిహద్దు ప్రాంతమైన సుకుమామిడి గ్రామం వద్ద.. నూలు దారాల లోడులో తరలిస్తున్న 1000 కిలోల గంజాయిని ఎస్ఐ వాసంశెట్టి సత్తిబాబు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. సుకుమామిడి శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా చింతూరు వైపు వెళ్తున్న లారీని తనిఖీ చేశామని చెప్పారు.

రూ.30 లక్షల విలువైన 40 బస్తాల గంజాయిని పోలిసులు గుర్తించారు. గంజాయిని ముంబైకి రవాణా చేస్తున్నట్లు విచారణలో నిందితులు తెలిపారని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ముంబైకి చెందిన అశోక్ పితాజీ, జితేష్ మధుకర్లను అనే వ్యక్తులను అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. లారీతో పాటు సెల్ ఫోన్ సీజ్ చేశామన్నారు.

ఇదీ చదవండి:

పెళ్లికి హాజరై వస్తుండగా ప్రమాదం- ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.