తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని సఖినేటిపల్లి మండలం... అంతర్వేది, పల్లిపాలెం మొదలుకొని ఐ.పోలవరం మండలం భైరవపాలెం వరకు సుమారు 60 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు సముద్రతీరం వెంట ఉండటంతో భూగర్భ జలాలు ఉప్పు కయ్యలుగా ఉంటాయి. ఈ నీరు తాగేందుకు, స్నానాలు చేసేందుకు పనికిరావు. రక్షిత మంచినీటి పథకాలు ఉన్నా... వేసవి కావడంతో వాటి ద్వారా పూర్తిస్థాయిలో ప్రజలకు తాగునీరు అందటం లేదు. అధికారులు అరకొరగా ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నా... అవి కూడా సరిగ్గా అందడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఇళ్ల ముందు ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకుని... తాగునీటి ట్యాంకర్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా తమ కష్టాలను తీర్చాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: