కరోనా నేపథ్యంలో ప్రతి పేద కుంటుంబానికి వెయ్యి నగదుతోపాటు, కేజీ కందిపప్పు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఏప్రిల్ 1వ తేదీనే పింఛన్లు అందించేందుకు సమాయత్తమవుతున్నామన్నారు. రేషన్ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికీ సరకులు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించిన ఆయన...ప్రభుత్వ మద్దతు ధరకు ఎగుమతిదారులు రొయ్యలు కొనుగోలు చేయాలన్నారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత అందిరిపైనా ఉందన్నారు. వాలంటీర్లు పని చేయటం లేదని ప్రతిపక్షాలు విమర్శించటం సరికాదన్నారు. ప్రాణాలను లెక్కచేయకుండా అధికారులతో కలిసి వారు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు.
ఇదీచదవండి