కేంద్ర ప్రభుత్వ ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ... కాకినాడలో వైద్యులు ధర్నా నిర్వహించారు. బిల్లును ఉపసంహరించుకోవాలని నగరంలోని రంగరాయ వైద్య కళాశాల విద్యార్థులు, జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. 24 గంటలపాటు సాధారణ సేవలు నిలిపివేసి నిరసన తెలియజేశారు. జీజీహెచ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జెడ్పీ సెంటర్లో మానవహారం చేపట్టారు. ఎన్ఎంసీ బిల్లు అమలు వైద్యరంగానికి తీరని చేటన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తమ ఆలోచనలను ఉపసంహరించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి.. మద్యపాన నిషేధం జగన్తో సాధ్యం కాదు: పవన్