ETV Bharat / state

'పోలీసుల శ్రమ అభినందనీయం'

author img

By

Published : Apr 11, 2020, 6:23 AM IST

కరోనా విజృంభిస్తున్న కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రాణాలకు తెగించి కష్టపడుతున్న పోలీస్​ సిబ్బందికి పలువురు దాతలు ముందుకొస్తున్నారు. వారి శ్రమను అభినందిస్తూ పోలీస్​ సిబ్బందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు.

పోలీస్​ సిబ్బందికి నిత్యావసర సరుకులు అందజేత

రాష్ట్రంలో లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీస్​ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారికి అండగా నిలుస్తూ పలువురు దాతలు ముందుకొస్తున్నారు.

పోలీసులు పడుతున్న శ్రమ అభినందనీయం

కరోనా వైరస్​ను కట్టడి చేయటానికి పోలీసులు పడుతున్న శ్రమ అభినందనీయమని ప్రకాశం జిల్లా ఇంకొల్లు సీఐ రాంబాబు అన్నారు. మార్టూరు పోలీస్ స్టేషన్​లో పోలీసులకు నిత్యావసర సరుకులను, కూరగాయలను ఆయన పంపిణీ చేశారు.

పోలీస్​ సిబ్బందికి ఆహారం అందించిన వైకాపా నేతలు

కరోనా నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తునిలో లాక్​డౌన్​తో పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు పట్టణంలోని 14 వార్డు వైకాపా నాయకులు ఆహారం అందించారు. ఈ సందర్భంగా దాతలను పోలీసులు అభినందించారు.

ఇదీ చూడండి: మార్పు మంచికే.. సామాజిక దూరం ఇందుకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.