తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తమూలపేటలోని ఎస్సార్ ఫౌండేషన్ పేదలకు అండగా నిలిచింది. లాక్డౌన్ తరుణంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు నిత్యావసర సరకులను అందించి ఆదుకున్నారు. ఫౌండేషన్ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి కొత్త మూలపేటలో 1300 కుటుంబాలకు నిత్యావసర సరకులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యుడు దొరబాబు హాజరై సరకులను పంపిణీ చేశారు. కష్టకాలంలో పేదలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన ఫౌండేషన్ ఛైర్మన్ రమా, రామకృష్ణారెడ్డిలను ఆయన అభినందించారు.
ఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ - Distribution of essential needs at kothamulapeta village
తూర్పుగోదావరి జిల్లా కొత్తమూలపేటలో ఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1300 కుటుంబాలకు 8 లక్షల వ్యయంతో పది కేజీల బియ్యం, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. వీటిని స్థానిక శాసనసభ్యుడు దొరబాబు పేదలకు అందించారు.
తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తమూలపేటలోని ఎస్సార్ ఫౌండేషన్ పేదలకు అండగా నిలిచింది. లాక్డౌన్ తరుణంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు నిత్యావసర సరకులను అందించి ఆదుకున్నారు. ఫౌండేషన్ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి కొత్త మూలపేటలో 1300 కుటుంబాలకు నిత్యావసర సరకులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యుడు దొరబాబు హాజరై సరకులను పంపిణీ చేశారు. కష్టకాలంలో పేదలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన ఫౌండేషన్ ఛైర్మన్ రమా, రామకృష్ణారెడ్డిలను ఆయన అభినందించారు.
ఇదీచదవండి: 1500 కుటుంబాలకు నిత్యావసర సరకుల పంపిణీ