ETV Bharat / state

స్థానిక అవసరాలు తీర్చేలా వినూత్న ఆవిష్కరణలు - ఎంహెచ్‌ఆర్‌డీ

నిత్యం తమ చుట్టుపక్కల చూసే సమస్యలకు ఏదైనా పరిష్కారం ఆలోచించారు ఆ విద్యార్థులు. అనుకున్నదే తడవుగా వాటిని ఆచరణలో పెట్టారు. ఆ ఆలోచనలో నుంచి పుట్టిన ప్రయోగాలే... భావి అవసరాలు తీర్చే మార్గం చూపింది. విద్యార్థుల సృజనకు ఆచార్యుల ప్రోత్సాహం తోడైంది. వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చింది. ఖర్చులు తగ్గించే.. ప్రమాదాలకు ఆస్కారం లేని.. పర్యావరణ హిత యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రకృతి వనరులనూ సద్వినియోగం చేసుకునే దిశగా అవకాశం కల్పించే ఆవిష్కరణలు సాక్షాత్కరించాయి. ఇంతకి వారు ఎవరు? ఏమి చేశారు? అనే విషయాల కోసం ఈ కథనం చదివేయండి మరి!

ఆవిష్కరణలు
innovation
author img

By

Published : Dec 28, 2020, 2:22 PM IST

జేఎన్‌టీయుకేలో ఎంహెచ్‌ఆర్‌డీ రూ.10 కోట్ల నిధులతో 2016లో అప్పటి ఉపకులపతి వీఎస్‌ఎస్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభించారు. సౌత్‌ ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత అధునాతనంగా తీర్చిదిద్ది నిరుడు ఆగస్టు నుంచి కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఏటా 100 మందికి పైగా విద్యార్థుల ఆలోచనలకు రూపకల్పన జరుగుతోంది. ఇక్కడ నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ట్రిపుల్‌ఐటీ పులివెందుల, ట్రిపుల్‌ ఐటీ నూజివీడు అనుసంధానంగా ఆవిష్కరణలు చేపడుతున్నారు. ఇన్నోవేషన్‌ కేంద్రం ఆరంభం నుంచి 327 ప్రయోగాలు చేశారు. ఎనిమిది జిల్లాల పరిధిలోని 240 అనుబంధ కళాశాలల వారికి ఇక్కడ అవకాశం ఇస్తారు. అంతేకాదు.. పరిశ్రమలకు సాంకేతిక సమస్యలు వస్తే వాటిని ఇన్నోవేషన్‌ సెంటర్‌ నివృత్తి చేస్తుంది. వ్యవసాయ, ఆక్వా, పరిశ్రమ, సమాజంలో ప్రజలకు అవసరమయ్యే ప్రయోగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.

మీట నొక్కి.. జాకీతో వాహనం ఎత్తేయొచ్చు:

innovation
ఆవిష్కరణలు

కార్లు, ఇతర భారీ వాహనాలు పైకి ఎత్తడానికి వాడే పరికరం (బ్లూటూత్‌ ఆపరేటెడ్‌ స్క్రూ జాకీ) - రూ.30 వేలు - డీసీ గేర్‌ 12 ఓల్ట్స్, 3,000 ఆర్‌పీఎం మోటార్లు.. ఆర్డునో సర్క్యూట్‌ బోర్డు, బ్లూటూత్‌ మాడ్యూల్, ప్రత్యేక యాప్‌ రూపొందించారు.

ఈ పరికరాన్ని మాటలు, సందేశాల (స్పీచ్, టెక్ట్స్‌) సంకేతాల ఆధారంగా చరవాణిలో బ్లూటూత్‌తో వాడవచ్చు. నాలుగు చక్రాలు, ఇతర భారీ వాహనాల టైర్లు మార్చాల్సి వస్తే.. ప్రమాదాల సమయంలో వాహనాలను పైకి లేపాల్సి వచ్చినప్పుడు మనిషి సాయం లేకుండా ఈ యంత్రాన్ని వినియోగించే వీలుంది.- కె.అమ్మిరెడ్డి, (ఎంటెక్‌)

స్పీడ్‌ బ్రేకర్‌తో విద్యుత్తు ఉత్పత్తి:

innovation
ఆవిష్కరణలు

ఎలక్ట్రిసిటీ రోడ్‌ విత్‌ కైనటిక్‌ ఎనర్జీ- వాహనాల రాకపోకల వేళ ఐరన్‌ స్పీడ్‌ బ్రేకర్లు కిందకు, పైకి ఒత్తిడికి గురైన క్రమంలో విద్యుత్తును ఉత్పత్తి చేసే యంత్రం. - రూ.30 వేలు - డైనమో.. బ్యాటరీ, చైన్, కంప్రెసింగ్‌ స్ప్రింగులు.. సెన్సార్లు - స్పీడ్‌ బ్రేకర్ల కింద అమర్చే యంత్రం ఇది.

వాహనాల రాకపోకల క్రమంలో కంప్రెస్‌ అవుతోంది. దాని కింద కైనటిక్‌ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్‌ విద్యుత్తు శక్తి ఉత్పత్తి అయ్యేలా సాంకేతికత రూపొందించారు. బ్యాటరీ, డైనమో సామర్థ్యం ఆధారంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చు. స్పీడ్‌బ్రేకర్ల సమీపంలో విద్యుత్తు వీధిదీపాలకు ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు వాడుకోవచ్చు. - ఐ.దుర్గాపవన్‌ (ఎంటెక్‌)

పైపులైన్ల లోగుట్టు పసిగట్టొచ్చు:

innovation
ఆవిష్కరణలు

పైపులైన్‌ ఇన్‌స్పెక్షన్‌ రోబోట్‌ - గ్యాస్, ఆయిల్, తాగునీటి పైపులైన్లలో సాంకేతిక లోపాలు గుర్తించే పరికరం - రూ.35 వేలు - వైర్‌లెస్‌ కెమెరా, ఆరు చక్రాల రోబోట్, కనెక్షన్‌ కోసం ఆర్డినో బోర్డు, సర్క్యూట్‌ బోర్డు - భూమిలో ఉన్న పైపులైన్లకు రంధ్రం పడినా, ఏమైనా అడ్డంపడి సరఫరాకు విఘాతం కలిగినా కనిపెట్టే వీలుంది.

రోబోట్‌కు అమర్చిన వైర్‌లెస్‌ కెమెరా ద్వారా అక్కడి పరిస్థితి చరవాణిలో చూసి సరిచేసే వీలుంది. - ఎస్‌.సునీల్‌ (ఎంటెక్‌)

బోరు బావిలో పిల్లలు పడిపోతే రక్షిస్తుంది:

innovation
ఆవిష్కరణలు

స్మార్ట్‌ రోబోటిక్‌ టెక్నాలజీ ఫర్‌ రెస్క్యూయింగ్‌ బేబీ ఇన్‌ బోర్‌వెల్‌- బోరు బావిలో పడిపోయిన పిల్లలను రక్షించే యంత్రం - రూ.65 వేలు - 10 ఆర్పీఎం డీసీ గేర్‌ మోటార్, ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్స్, వైఫై టెక్నాలజీ - బోరు బావిలో పిల్లలు పడిపోయినప్పుడు వారిని సురక్షితంగా బయటకు తీసే పరికరం. బోరు లోతు ఎంత ఉందనేది సెన్సార్‌ ఆధారంగా లెక్కిస్తారు. లోపలి పరిస్థితిని వైర్‌లెస్‌ కెమెరా ఆధారంగా గుర్తిస్తారు. చరవాణితో వైఫై ఆధారంగా ఈ యంత్రాన్ని ఆపరేట్‌ చేస్తారు. ఆపోజిట్‌ థ్రెడ్డింగ్‌ మెకానిజంతో రూపొందించారు. రోబోటిక్‌ క్లాంపుల మెకానిజంతో బోరులో పడిన పిల్లలను సురక్షితంగా బయటకు తీసేలా తీర్చిదిద్దారు. - ఎస్‌.సతీష్, డి.తరుణ్‌ (ఎంటెక్‌)

క్షణాల్లో కొబ్బరి పీచు ఒలిచేస్తుంది:

మోటరైజ్డ్‌ కోకోనట్‌ డీ హస్కింగ్‌ మిషన్‌- కొబ్బరి బోండాల నుంచి పీచు తొలగించే యంత్రం - రూ.40 వేలు - ఆఫ్‌ హెచ్‌పీ విద్యుత్తు మోటారు. బేరింగ్‌లు, పుల్లీలు, గేర్లు, రోలర్‌. బెల్ట్, చైనుతో పవర్‌ ఉత్పత్తి అయ్యేలా యంత్రం రూపకల్పన. - ఈ యంత్రంతో 30 సెకన్లలో ఒక కొబ్బరి కాయ ఒలిచే వీలుంది. నిరంతరం నాలుగైదు గంటలు ఈ యంత్రాన్ని వినియోగించవచ్చు. మోటారు వేడెక్కితే కాస్త విరామం ఇచ్చి మళ్లీ పని ప్రారంభించవచ్చు. - కె.అమ్మిరెడ్డి, దుర్గాపవన్, సతీష్, సునీల్, మహేంద్ర (ఎంటెక్‌)

రోడ్డు దాటే చిన్నారులకు భరోసా:

ఇంటెలిజెంట్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఫర్‌ స్కూల్‌ జోన్‌- విద్యాలయాల వద్ద ప్రమాదాల నివారణకు దోహదం - రూ.20 వేలు - నాలుగు మోటార్లు, మోషన్‌ సెన్సార్లు, 24 వాట్స్, 330 వాట్స్‌ బ్యాటరీలు - పాఠశాలల ప్రాంగణాల్లో విద్యార్థులు వెళ్లి వచ్చే క్రమంలో వాహనాల రాకపోకలతో ప్రమాదాలకు వీలుంది. ఈ పరికరం సంబంధిత వాహనంలో అమరిస్తే వాహనం ఎదురుగా ఎవరైనా వస్తే, వాహనాలు వచ్చినా 5-10 మీటర్ల దూరం నుంచి వాహన వేగం తగ్గి దగ్గరకొచ్చేసరికి ఆగిపోతుంది. - జి.మహేంద్ర, (ఎంటెక్‌)

కొత్తవాటికి ప్రోత్సాహం

మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంటు నుంచి డిజైన్‌ ఇన్నోవేషన్‌ ప్రాజెక్టు కింద విద్యార్థుల ఆవిష్కరణలకు నిధులు సమకూరుస్తున్నాం. ఈ విద్యాసంవత్సరంలో 30 మంది వరకు విద్యార్థులు నూతన ఆవిష్కరణలు రూపొందించారు. స్థానిక పరిశ్రమలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అవసరమైన సాంకేతిక సలహాలు కూడా అందిస్తున్నాం. - డాక్టర్‌ ఎ.గోపాలకృష్ణ, ఫ్రొఫెసర్‌ ఇన్‌ఛార్జి, ఇన్నోవేషన్‌ సెంటర్‌

ఇదీ చదవండి:

గూగుల్​, యూట్యూబ్​ సాయంతో కారునే ఆవిష్కరించాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.