రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు... దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఆయన సందర్శించారు. వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ అధికారులు స్వామివారి చరిత్రను వివరించి చిత్రపటాన్ని అందించారు.
ఇదీచదవండి