
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తుడు రూ. 6 లక్షలు విరాళం అందించారు. హైదరాబాదకు చెందిన పి. శ్రీధర్, శ్రీలక్ష్మి దంపతులు ప్రతి ఏటా ఆలయంలో ఒక రోజు అన్నదానం చేయాలని కోరారు. ఆలయంలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగమైనందుకు శ్రీధర్ దంపతులను ఈవో అభినందించారు.
ఇదీ చదవండి: సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం- 10 మంది మృతి