గోదావరి వరద ప్రభావిత గ్రామాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. 2 జిల్లాల్లోని అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారన్నారు . గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించినట్లు ఆయన తెలిపారు. అక్కడ నివసిస్తున్న వారికి అవసరమైన నిత్యవసర వస్తువులు అందించామన్నారు. అన్నాక్యాంటీన్లు మూసివేయబోమని...అన్నీ రెండు, మూడు రోజుల్లో పని చేస్తాయని స్పష్టం చేశారు. జూలై 30న ద్రవ్య వినియోగ బిల్లు ఆమోదం పొందిందని...చెల్లింపుల విషయంలో ఇక ఎలాంటి సమస్య ఉండబోదని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి గ్రామ సచివాలయ ఉద్యోగం.. మహిళలకే సగం