దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. కరోనా కాలంలో పెద్ద ఎత్తున 108, 104 వాహనాల ఏర్పాటు రాష్ట్ర ప్రజలకు ఉపయోగకరమని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో... నూతనంగా మంజూరు చేసిన 108 వాహనాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
మండపేట ఆసుపత్రిని... ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి మార్చేందుకు కృషి చేస్తున్నట్లు పిల్లి సుభాష్ చెప్పారు. పెద్ద కాలువ సమీపంలోని వేర్ హౌస్ స్థలంలో సుమారు 39 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు పూర్తి స్థాయిలో మొదలవుతాయన్నారు.
ఇదీ చదవండి