తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం దుగ్గుదుర్రు గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గ్రామంలో కొందరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్న స్థానికుల సమాచారంతో... పూజలు నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా... కాకినాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దుగ్గుదుర్రులో ఇంటిని రెండేళ్ల క్రితం అద్దెకు తీసుకున్నాడని... తరుచూ ఇక్కడికి వచ్చి వెళ్తుంటారని పోలీసులు తెలిపారు. ఇళ్లు అద్దెకు తీసుకున్నవారు క్షుద్రపూజలు చేశారని తేలితే... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గొల్లపాలెం ఎస్సై జాన్‌భాషా తెలిపారు.
ఇదీ చదవండీ...