తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లికి చెందిన గర్భిణీ బొడ్డు సునీతను ఆటోలో మండపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద కాలువ వంతెన వద్దకు వచ్చేసరికి నొప్పులు తీవ్రత ఎక్కువ కావటంతో.. వేగంగా వారు ఆసుపత్రికి చేరుకుని విషయం డాక్టర్ హేమలతకు తెలిపారు. దీంతో ఆమె పరుగున వెళ్లి ఆసుపత్రి ఆవరణలో ఉంచిన ఆటోలొనే చికిత్స అందించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆమె తెలిపారు.
ఇదీ చూడండి