తూర్పుగోదావరి జిల్లా..
పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 105వ జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఆయన చిత్రపటానికి భాజపా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీన దయాల్ గొప్ప సంఘ సంస్కర్త అని భాజపా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమ అన్నారు. ఈ సందర్భంగా పి.గన్నవరం పోలీసులకు ఫేస్ షీల్డ్లు అందించారు
కృష్ణా జిల్లా..
దీన్ దయాల్ ఉపాధ్యాయగా 105వ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా విజయవాడ భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ , నేతలు నివాళులు అర్పించారు. ఇతర నాయకులు దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో 100 మందికి ఉచిత వినికిడి మిషన్లు అందజేశారు. మహోన్నత వ్యక్తిత్వం కలిగిన దీన్ దయాళ్ ఒక సిద్ధాంతాన్ని నమ్మిదానికే కట్టబడ్డాడని సత్యకుమార్ అన్నారు. పేదరికంలో మగ్గుతున్న వారికి ఆర్ధిక స్వాతంత్య్రం ఎంతో అవసరమని... సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా పని చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. నేడు భాజపా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తూ.. ఆచరిస్తుందన్నారు.
ఇదీ చూడండి. కుటుంబ కలహాలతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త