అయిదు రోజుల కిందటి వరకు తక్కువ కరోనా కేసులు ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో.. పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలోని పాజిటివ్ కేసుతో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. జిల్లాలో సోమవారానికి 123 కేసులు ఉండగా దానిలో 53 కేసులు జి.మామిడాడకు అనుబంధంగా నమోదయ్యాయి. ఈ కేసులన్నీ పెదపూడి మండలంతోపాటు రామచంద్రపురం, బిక్కవోలు, మండపేట, తుని, మండలాల్లో వెలుగు చూశాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమై మామిడాడ , బిక్కవోలు మండలాల్లో అధిక సంఖ్యలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మంగళవారం ఉదయానికి తూర్పు గోదావరి జిల్లా జి. మామిడాడకు సంబంధించి మరో 19 మందికి పాజిటివ్ నమోదు కాగా బిక్కవోలులోని 5 సంవత్సరాల బాలుడికి కొరోనా సోకింది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అధికార యంత్రాంగం జి. మామిడాడ, బిక్కవోలు కొన్ని రహదారులు మూసి వేసి రాకపోకలు నిలిపేసింది. అదే విధంగా రామచంద్రాపురం, మండపేటలో ఆంక్షలు విధించారు.
ఇదీ చదవండి: