తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట రెడ్‌జోన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్తపేట సంత మార్కెట్ ఏరియాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో రెడ్‌జోన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిన ముగ్గురు బాధితులకు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స అందించారు. వారికి పరీక్షలు నిర్వహించగా... ఒకరికి నెగెటివ్ రావటంతో డిశ్ఛార్జ్ చేశారు.
ఇదీ చదవండి: విభిన్నశైలిలో కరోనా వైరస్‌పై అవగాహన