ETV Bharat / state

యానంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య..

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య ప్రతిరోజు 1000కి మించి నమోదవుతున్నాయి. ఈ ప్రభావంతో జిల్లాలో అంతర్భాగమైన కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించని స్థాయికి చేరుకుంటున్నాయి. గత వారం వరకు 150 కేసులకు పరిమితమవగా.. ఒక్క వారం రోజుల్లోనే 100 కేసులు వెలుగుచూశాయి.

corona cases
corona cases
author img

By

Published : Aug 3, 2020, 1:37 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 70 వేల జనాభా కలిగిన యానంలో మొత్తం 2200 మందికి పరీక్షలు నిర్వహించగా 262 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. 93 మంది చికిత్స అనంతరం కోలుకొని ఇంటికి వెళ్లగా.. ప్రస్తుతం 166 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 70 సంవత్సరాలు పైబడిన ముగ్గురు మహిళలు ఇతర అనారోగ్య సమస్యలతోపాటు కరోనా ప్రభావంతో మృతి చెందారని డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా తెలిపారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆదేశాల మేరకు యానం సామాన్య ఆసుపత్రిని పూర్తిగా కొవిడ్ చికిత్స కేంద్రంగా మార్పుచేసి 200 పడకల అందుబాటులో ఉంచుతున్నారు. ఇవి కాక అదనంగా మెట్టుకుర్రు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను 80 పడకల ఆసుపత్రిగా మార్చి అన్ని సౌకర్యాలు కల్పించారు. జనరల్​, అవుట్ పేషెంట్లు కోసం మహాత్మ బాలుర పాఠశాలను తాత్కాలిక ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నారు.

  • అధైర్యపడవద్దు..104 కు కాల్ చేయండి.

కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నా.., ఇతర ఏ రకమైన వ్యాధులతో బాధపడుతున్నా అధైర్యపడకుండా స్థానిక ఆశా వర్కర్ లేదా 104 టోల్ ఫ్రీ నెంబర్​కు సమాచారం ఇవ్వాలని .. డాక్టర్ల పరిశీలన అనంతరం హోమ్ క్వారంటెన్ లేదా హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స మందులు ఇస్తారని, అత్యవసర పరిస్థితి అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని ఆరోగ్య శాఖ అధికారి కాశి సత్యనారాయణ తెలిపారు.

  • ఆగస్టు నెల అత్యంత కీలకం:: డిప్యూటీ కలెక్టర్ మీనా

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ కరోనా మహమ్మారి విస్తరించిందని. అదే యానంలో కేసులు పెరుగుదలకు ప్రధాన కారణమని ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు నెలలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనాలు వేసి అందుకు తగిన నివారణ చర్యలు చేపట్టేలా కార్యాచరణ సిద్ధంచేసాయన్నారు.. ఇందుకు ప్రజలంతా పూర్తిగా సహకరించాలని కోరారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉదయం ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే అన్ని రకాల వ్యాపారాలకు అనుమతి ఇచ్చామని.. కేసుల పెరుగుదల దృష్ట్యా త్వరలో పదిహేను రోజులపాటు పూర్తి లాక్ డౌన్ విధించే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కరోనా బారిన పడిన వారిలో 70% మందికి ప్రైమరీ కాంటాక్ట్ ద్వారానే సోకిందని .. దయచేసి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం.. శానిటైజర్ వినియోగించడం.. సామాజిక దూరం పాటించడం తప్పనిసరిగా చేయాలన్నారు.

ఇదీ చదవండి: ఈ- కామర్స్‌లో ఇష్టారాజ్యానికిక చెల్లుచీటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.